వాట్సప్ ప్రైవసీ పాలసీ డెడ్‌లైన్ ఇదే..!

April 16, 2021 at 12:56 pm

రెండు నెలల క్రితం వాట్సప్ ప్రైవసీ పాలసీ లేపిన దుమారం అందరికి తెలిసిందే. ఆ తర్వాత ప్రైవసీ పాలసీలో కాస్త మార్పులు చేసి కొత్త పాలసీని వాట్సప్ ప్రకటించింది. ఈ ప్రైవసీ పాలసీని మే 15 లోపు అంగీకరించాలసి ఉంటుంది. ఇంకా వాట్సప్ ప్రైవసీ పాలసీని యాక్సెప్ట్ చేయనివారికి మరో నెల రోజులు గడువు మాత్రమే ఉంది. ఇప్పటికీ ప్రైవసీ పాలసీ అంగీకరించని వారికి తరచూ రిమైండర్స్ పంపిస్తోంది వాట్సప్.

2021 మే 15 లోగా ప్రైవసీ పాలసీని అంగీకరించాలని కోరింది. ఒకవేళ ఆ తేదీ లోగా ప్రైవసీ పాలసీ అంగీకరించకపోతే ఏమవుతుందన్న సందేహాలు వినియోగదారుల్లో ఉన్నాయి. ఒకవేళ మీరు వాట్సప్ కొత్త నియమ నిబంధనలు అంగీకరించకపోతే వారికీ కొన్ని ఇబ్బందులు ఎదురుకోక తప్పదు. అదేమిటంటే 120 రోజుల పాటు వాట్సప్ ఉపయోగించుకోవచ్చు కానీ కొన్ని ఫీచర్స్ పని చేయవు. మీరు నోటిఫికేషన్స్, కాల్స్ రిసీవ్ చేసుకోవచ్చు, కానీ వాట్సప్ నుంచి మెసేజెస్ పంపడం వీలు కాదు.

Nothing comes between you and your privacy. Messaging with a business is optional, and their chats are clearly labeled on the app. You are in control.

For more information, please read: https://t.co/55r1Qxv2Wi pic.twitter.com/HswXxRylHo
— WhatsApp (@WhatsApp) February 18, 2021

వాట్సప్ ప్రైవసీ పాలసీ డెడ్‌లైన్ ఇదే..!
0 votes, 0.00 avg. rating (0% score)

Related Posts