`పుష్ప‌` సినిమాపై నెటిజ‌న్స్‌ ట్రోల్స్‌..ఏం జ‌రిగిందంటే?

May 3, 2021 at 8:12 am

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప‌`. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపించనున్నాడు.

ప్యాన్ ఇండియా లెవల్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఇప్ప‌టికే చాలా వ‌ర‌కు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో పుష్ప‌ చిత్రం కాపీ అంటూ నెటిజ‌న్స్ ట్రోల్ చేస్తున్నారు. ఈ సినిమా సిస్టర్ సెంటిమెంట్‌తో ముందుకు సాగుతుందనే వార్తలు గతంలోనే వచ్చాయి. హీరో అమితంగా ప్రేమించే తన సిస్టర్ ఓ ఫారెస్ట్ ఆఫీసర్ కారణంగా చనిపోతుందట.

దీంతో ఆమె మరణానికి కారకుడైన వ్యక్తిని హీరో ఎలా అంతం చేశాడ‌న్న‌దే ఈ చిత్రం అంటూ ప్ర‌చారం జ‌రిగింది. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన విలన్ చిత్రం స్టోరీ కూడా ఇదే. అందుకే నెటిజ‌న్లు విలన్ చిత్రం ఆధారంగా తీసుకుని పుష్ప సినిమాని తెర‌కెక్కిస్తున్నారంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

`పుష్ప‌` సినిమాపై నెటిజ‌న్స్‌ ట్రోల్స్‌..ఏం జ‌రిగిందంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts