షెడ్యూల్‌ ప్రకారమే పరీక్షలు: మంత్రి

టెన్త్ పరీక్షల నిర్వహణపై ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మరోసారి క్లారిటీ ఇచ్చారు. జూన్ 7 నుంచి పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. షెడ్యూల్ ప్రకారమే టెన్త్ పరీక్షలకు విద్యార్థులు సన్నద్దం అవ్వాలని సూచించారు. విద్యార్థులకు మంచి భవిష్యత్ ఇవ్వాలన్నదే తమ లక్షం అని అన్నారు. రాబోయే రోజుల్లో కరోనా పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు. వైరస్ కట్టడికి సీఎం జగన్ మోహన్ రెడ్డి చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని అన్నారు. జూన్ 1 నుంచి పాఠశాలలకు ఉపాధ్యాయులు హాజరు కావాలనన్నారు. ఈ నెలాఖరు వరకు విద్యార్థులకు సెలవులు ఇచ్చామన్న మంత్రి వారి భవిష్యత్తు కోసమే పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. పలు రాష్ట్రాలు ఇప్పుటికే పరీక్షలు నిర్వహించాయన్నారు. జూన్ 1 నుంచి టీచర్లు విధులకు హాజరుకావాల్సిందిగా ఆదేశించామని తెలిపారు. త్వరలో పరీక్ష షెడ్యూల్ పై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో పదోతరగతి, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది.