హీరో రామ్ ఇంట తీవ్ర‌ విషాదం!

టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ హీరో రామ్ పోతినేని ఇంట్లో తీవ్ర విషాదం నెల‌కొంది. రామ్ తాతయ్య నేటి ఉద‌యం కన్నుమూశారు. ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా ఆయ‌న మృతి చెందిన‌ట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ రామ్‌ ఓ భావోద్వేగ ట్వీట్‌ పెట్టారు.

తాతయ్య విజయవాడలో ఓ లారీ డ్రైవర్‌గా ప్రారంభమై ఉన్నత శిఖరాలకు వెళ్లిన మీ జీవితం మాకు ఎన్నో పాఠాలు నేర్పించింది. కుటుంబసభ్యులకు అన్ని రకాల వసతులు, సౌకర్యాలు అందించడం కోసం ఆరోజుల్లో మీరు లారీ టైర్లపైనే నిద్రించేవాళ్లు. మీది రాజు లాంటి మనసు. జేబులో ఉన్న డబ్బుని బట్టి ఎవరూ ధనవంతులు కాలేరని.. మంచి మనసుతోనే ధనవంతులు అవుతారని మీరే మాకు నేర్పించారు.

మీ పిల్లలందరూ ఉన్నత స్థానాల్లో ఉన్నారంటే దానికి మీరే కారణం. కానీ, ఇప్పుడు మీ మరణవార్త నన్ను ఎంతో కలచివేసింది. నా హృదయం ముక్కలైంది. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తున్నా.. అంటూ రామ్ ట్వీట్ చేశారు. దీంతో రామ్ తాత‌య్య మృతి ప‌లువురు ప్ర‌ముఖులు సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు.

https://twitter.com/ramsayz/status/1394502309699219458?s=20