గూఢచారి హీరో పెద్ద మనసు..!

May 5, 2021 at 2:54 pm

ప్రస్తుతం మన దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ వేగంగా విజృంభిస్తుంది. ఇప్పటికే సోనూసూద్ వంటి స్టార్ హీరోలు కరోనాతో బాధ పడుతున్న ప్రజలకు తమ వంతు సాయం చేస్తూ రియల్ హీరోస్ గా పేరు తెచ్చుకుంటున్నారు. మరోవైపు సందీప్ కిషన్ కూడా కరోనా కారణంగా అనాథలైన పిల్లలను రెండేళ్ల వరకు వారికీ కావాల్సిన అవసరాలను తీరుస్తానని ప్రకటించారు. అలాగే తాజాగా హీరో అడివి శేష్ కూడా కరోనా క్లిష్ట పరిస్థితిలో తన వంతు సాయం చేసి నిజమైన హీరో అనిపించుకున్నాడు.

అడివి శేష్ తెలంగాణ రాజధాని హైదరాబాద్ కోటి ప్రభుత్వ ఆసుపత్రి కోసం వాటర్ ప్లాంట్ ఇచ్చాడు. కోటి ప్రభుత్వ హాస్పిటల్‌లో తాగునీటి సమస్య ఉంది. అక్కడికి చికిత్స కోసం వచ్చే పేషెంట్స్ తో పాటు వారి బంధువులు తాగునీటి కోసం చూస్తున్నారు. ఈ సంగతి సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న అడివి శేష్, హాస్పిటల్ అవసరాల కోసం 865 లీటర్ల సామర్ధ్యం ఉన్న వాటర్ ప్లాంట్‌ను హాస్పటల్‌కి ఇచ్చాడు అడివి శేష్. ఈ వాటర్ ప్లాంట్ 1000 లీటర్ల తాగునీటిని శుద్ది చేస్తుందట. ఈ సందర్భంగా అడివి శేష్ చేసిన ఈ పనికి అందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గూఢచారి హీరో పెద్ద మనసు..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts