నాని ద‌ర్శ‌కుడికి ఒకే చెప్పిన బ‌న్నీ..త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న‌?

May 9, 2021 at 8:53 am

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ద‌శ‌లో ఉంది. ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది.

అయితే ఈ చిత్రం త‌ర్వాత బ‌న్నీ ఏ ద‌ర్శ‌కుడితో సినిమా చేయ‌బోతున్నాడు అన్న‌ది ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ రాలేదు. ఇప్ప‌టికే ప‌లువురి ద‌ర్శ‌కుల పేర్లు వినిపించ‌గా.. ఇప్పుడు ఈ లిస్ట్‌లో డైరెక్ట‌ర్ గౌతమ్ తిన్ననూరి పేరు కూడా వ‌చ్చి చేరింది. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఇటీవ‌లె గౌతమ్ తిన్ననూరి అల్లు అర్జున్ కి కథ చెప్ప‌డ‌ట‌.

క‌థ బాగా న‌చ్చ‌డంతో వెంట‌నే బ‌న్నీ ఓకే చెప్పాడ‌ని.. దాంతో గౌత‌మ్ ఫుల్ స్క్రిప్ట్ కూడా పూర్తి చేశాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక అన్ని అనుకున్నట్లు జరిగితే.. నవంబర్ లో దీపావళికి స్పెషల్ గా ఈ సినిమాని స్టార్ట్ చేయ‌నున్నార‌ని, త్వ‌రలోనే ప్ర‌క‌ట‌న కూడా రానుంద‌ని టాక్‌. కాగా, నాని హీరోగా జెర్సీ సినిమాను తెర‌కెక్కించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు గౌత‌మ్‌. ప్ర‌స్తుతం ఈయ‌న షాహిద్ కపూర్ హీరోగా జెర్సీ సినిమాని హిందీలోకి రీమేక్ చేస్తున్నాడు.

నాని ద‌ర్శ‌కుడికి ఒకే చెప్పిన బ‌న్నీ..త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts