బ‌న్నీ ఫ్యాన్స్‌కు డ‌బుల్ ట్రీట్ ఇవ్వ‌బోతున్న సుక్కు?

May 7, 2021 at 8:52 am

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప‌`. ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు పాన్ ఇండియా స్టాయిలో నిర్మిస్తున్నారు.

క‌రోనా స‌మ‌యంలోనూ ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. అయితే తాజాగా స‌మాచారం ప్ర‌కారం.. బ‌న్నీ ఫ్యాన్స్‌కు డ‌బుల్ ట్రీట్ ఇవ్వ‌డానికి ప్లాన్ చేస్తున్నాడ‌ట సుక్కు. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. ఉత్కంఠభరితమైన కథాకథనాలతో .. ఆసక్తికరమైన మలుపులతో.. భారీ తారాగణంతో.. పుష్ప‌ సినిమా నడుస్తుంది. దీంతో ఈ సినిమా నిడివి పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయట.

అందుకే పుష్పను రెండు పార్ట్స్ గా తీసుకొస్తారనే న్యూస్ సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ ఏడాది ఫస్ట్ పార్ట్, వచ్చే ఏడాది సెకండ్ పార్ట్ విడుదల చేసేలా మూవీ యూనిట్ ప్లాన్ చేసుకుంటుందట. హీరో, డైరెక్టర్, చిత్ర నిర్మాణ సంస్థ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఈ వార్త‌ల్లో నిజ‌మెంతో తెలియాల్సి ఉంది.

బ‌న్నీ ఫ్యాన్స్‌కు డ‌బుల్ ట్రీట్ ఇవ్వ‌బోతున్న సుక్కు?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts