`పుష్ప 2`కు బ‌న్నీ రెమ్యున‌రేష‌న్ తెలిస్తే షాకే?!

May 14, 2021 at 8:31 am

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం పుష్ప‌. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్కుతున్న‌ ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతున్న సంగ‌తి తెలిసిందే.

కథా పరిధిని దృష్టిలో పెట్టుకొని దర్శకనిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నాడు. మొద‌టి భాగం ఈ ఏడాది విడుద‌ల కానుండ‌గా.. రెండో భాగం వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది. అయితే పుష్ప 2కు బ‌న్నీ రెమ్యూనరేష‌న్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

సెకండ్ పార్ట్ కోసం బన్నీ ఏకంగా రూ. 50 కోట్లు తీసుకుంటున్నాడట. దీంతో బన్నీ కెరీర్‌లో అందుతోన్న అతిపెద్ద పేమెంట్ ఇదేన‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక మొద‌టి భాగం విష‌యానికి వ‌స్తే.. పుష్ప1కు బన్నీ స‌న్నిహితులు స్లీపింగ్ పార్ట్నర్స్ గా ఉన్నార‌ట‌. వారు ప్రాఫిట్స్ లో భాగం తీసుకుంటారు. అందుకని బ‌న్నీ ఫస్ట్ పార్ట్‌కు కాస్త త‌క్కువ పారితోష‌క‌మే పుచ్చుకున్న‌ట్టు టాక్‌.

`పుష్ప 2`కు బ‌న్నీ రెమ్యున‌రేష‌న్ తెలిస్తే షాకే?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts