ఫ్యాన్ మెడెడ్ పోస్టర్ కు బన్నీ ఫిదా..!

May 6, 2021 at 11:39 am

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్వరలో పుష్ప చిత్రంతో ప్రేక్షకులని పలకరించనున్నారు. ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం గంధపు చక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ చాలా డిఫరెంట్ గా గతంలో ఎన్నడూ చూడని సరి కొత్త మాస్ లుక్ లో కనిపించనున్నాడు . ఈ మూవీలో బన్నీ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. కరోనా తీవ్రత కారన్నగా ఈ మూవీ షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తుంది.

ఇటీవలే అల్లు అర్జున్ కరోనావైరస్ బారిన పడి తిరిగి కోలుకుంటున్నారు. దాంతో పుష్ప చిత్రం షూటింగ్ కు ఇంకొంత బ్రేక్ పడింది. తాజాగా పుష్ప సంబంధించిన గ్రాఫిక్స్ పోస్టర్ ను అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో షేర్ చేసాడు. తన అభిమాని డిజైన్ చేసిన ఈ పోస్టర్ బన్నీ కి చాలా బాగా నచ్చిందని, దాంతో ఆ మూవీ పోస్టర్ ను అందరికి షేర్ చేస్తూ ఆ ఫ్యాన్ కి బన్నీ కృతజ్ఞతలు తెలిపాడు.

ఫ్యాన్ మెడెడ్ పోస్టర్ కు బన్నీ ఫిదా..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts