కరోనా నుంచి కోలుకుంటున్నా… : బన్నీ

May 3, 2021 at 3:59 pm

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి ఇటీవలే కరోనా సోకిన విషయం తెలిసిందే. దానితో బన్నీ హోం క్వారంటైన్‌ అయ్యారు. తాజాగా తన హెల్త్ కి సంబంధించిన అప్డేట్ ఇచ్చారుబన్నీ. అందరికీ హలో, ప్రస్తుతం నాకు బనే ఉంది. తేలికపాటి లక్షణాలే ఉన్నాయి. నేను కోలుకుంటున్నా. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. నేను సెల్ఫ్ ఐసోలేషన్ లోనే ఉన్నాను. మీరు అందరు చూపిస్తున్న ప్రేమ, అభిమానానికి ధన్యవాదాలు అంటూ తన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు బన్నీ.

ప్రస్తుతం అల్లు అర్జున్ ఇచ్చిన అప్డేట్ తో ఆయన ఫాన్స్ కొంత ఊపిరి పీలుస్తున్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రం పుష్ప లో చేస్తున్నాడు. ఈ చిత్రంలో బన్నీ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. కరోనా కారణంగా వాయిదా పడ్డ మూవీ షూటింగ్ కాస్త పరిస్థితులు చక్క బడ్డాక తిరిగి ప్రారంభం అవుతుంది.

కరోనా నుంచి కోలుకుంటున్నా… : బన్నీ
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts