`పుష్ప‌`లో త‌న క్యారెక్ట‌ర్‌ను లీక్ చేసిన అన‌సూయ‌!

May 5, 2021 at 10:26 am

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం పుష్ప‌. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కుతోంది. ఎర్ర‌ చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో బ‌న్నీ లారీ డ్రైవ‌ర్ పుష్ప‌రాజ్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు.

ఇక ఈ చిత్రంలో యాంక‌ర్ అన‌సూయ కూడా ఓ పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా త‌న పాత్ర‌కు సంబంధించిన కొన్ని వివ‌రాల‌ను అన‌సూయ బ‌య‌ట పెట్టింది. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న అన‌సూయ.. పుష్పలో నా క్యారెక్టర్‌ ఏంటో క్లారిటీగా చెప్పను.

కానీ, సినిమాకు మాత్రం ఆ పాత్ర చాలా కీలకం. సినిమాకి టర్నింగ్‌ పాయింట్‌ అయ్యేలా నా పాత్రను తీర్చిదిద్దాడు సుకుమార్‌. రంగమ్మత్త కంటే గొప్ప పాత్ర ఇందులో చేయబోతున్నాను అని చెప్పుకొచ్చింది. కాగా, మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఫహద్ ఫజల్ విలన్‌గా కనిపించనున్నాడు.

`పుష్ప‌`లో త‌న క్యారెక్ట‌ర్‌ను లీక్ చేసిన అన‌సూయ‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts