ప్రేమలో పడ్డ ప్రముఖ యాంకర్..?

May 3, 2021 at 2:49 pm

ప్రస్తుతం బుల్లితెర యాంకర్లు ఒకరిని మించి ఒకరు గ్లామర్ ఒలకబోస్తూ తమకంటూ గుర్తింపును సొంతం చేసుకుంటున్నారు. అలాగా తన అందం అభినయంతో యువతను మత్తు ఎక్కిస్తున్న యాంకర్స్ లో వర్షిణి ఒకరు. వర్షిణి ఢీ షోకు యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గర అయ్యింది.

ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారం అవుతున్న కామెడీ షో ద్వారా అందరిని అలరిస్తుంది . ఇందులో వర్షిణి తన ఎంట్రీ డాన్స్ లతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంటుంది. తాజాగా వర్షిణి తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఒక పిక్ షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. తను ఒకరి చేతి పై కళ్ళు మూసుకుంటూ వాలింది.ఆ వ్యక్తి ఫోటోను మాత్రం కనిపించకుండా జాగ్రత్త వహించింది. దీనితో అందరు వర్షిణి ప్రేమలో పడిందని కామెంట్స్ చేస్తున్నారు.

ప్రేమలో పడ్డ ప్రముఖ యాంకర్..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts