మ‌హేష్‌తో స‌రిలేరు నీకెవ్వ‌రు సీక్వెల్..క్లారిటీ ఇచ్చేసిన అనిల్‌!

May 9, 2021 at 10:38 am

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్‌ అనిల్ రావిపూడి కాంబోలో వ‌చ్చిన చిత్రం స‌రిలేరు నీకెవ్వ‌రు. గ‌త ఏడాది విడుదైన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం మంచి విజ‌యం సాధించ‌డంతో.. మ‌హేష్‌తో మ‌రో సినిమా చేయ‌బోతున్న‌ట్టు అనిల్ ప్ర‌క‌టించాడు.

ప్ర‌స్తుతం ఎఫ్ 2 సీక్వెల్‌గా ఎఫ్ 3 చేస్తున్న అనిల్‌.. త్వ‌ర‌లోనే మ‌హేష్‌తో స‌రిలేరు నీకెవ్వ‌రు సీక్వెల్ చేయ‌బోతున్నాడంటూ జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే తాజాగా ఈ వార్త‌ల‌పై అనిల్ స్పందించాడు.

స‌రిలేరు నీకెవ్వ‌రు సీక్వెల్ తెర‌కెక్కించే ఆలోచ‌న లేద‌ని అనిల్ కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. అలాగే త్రివిక్ర‌మ్‌గారితో మ‌హేష్‌గారి సినిమా పూర్త‌యిన త‌ర్వాత నా డైరెక్ష‌న్‌లో సినిమా ఉంటుంద‌ని అనిల్ వెల్ల‌డించేశాడు. కాగా, ప్ర‌స్తుతం పురుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట చేస్తున్న మ‌హేష్.. ఆ త‌ర్వాత త్రివిక్ర‌మ్‌తో సినిమా ప్ర‌క‌టించారు. ఈ చిత్రం త‌ర్వాత అనిల్ సినిమా సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంద‌న్న‌మాట‌.

మ‌హేష్‌తో స‌రిలేరు నీకెవ్వ‌రు సీక్వెల్..క్లారిటీ ఇచ్చేసిన అనిల్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts