మలయాళీ కుట్టితో ఉన్న వ్య‌క్తి ఎవరంటే..?

May 2, 2021 at 3:05 pm

తెలుగు సినీ పరిశ్రమలో వైవిధ్య‌మైన చిత్రాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని మెప్పిస్తున్న మ‌ల‌యాళ కుట్టి అనుప‌మ ప‌రమేశ్వ‌ర‌న్. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ఈ బ్యూటీ చేతిలో ఎలాంటి మూవీ ఆఫ‌ర్స్ లేవు. అప్పుడప్పుడు సోష‌ల్ మీడియా ద్వారా ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రిస్తూ అభిమానుల్ని అల‌రిస్తూ ఉంటుంది. ఇటీవలే పవన్ కళ్యాణ్ నటించిన వ‌కీల్ సాబ్ చిత్రం పై ప్రశంస‌లు కురిపించి పవన్ ఫాన్స్ అభిమానం దక్కించుకుంది.

ఇక ఇప్పుడు త‌న తమ్ముడితో దిగిన ఫొటో ఒకటి షేర్ చేసింది అనుపమా. ఇందులో చూడటానికి ఇద్ద‌రు ఒకేలా కనిపిస్తున్నారు. మ‌ల‌యాళ ప్రేమ‌మ్ చిత్రంతో సినీ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైన అనుప‌మ ప్ర‌స్తుతం పొలం ప‌నుల‌తో బిజీగా ఉంది. ఇటీవలే పొలంలో త‌పియోక దుంప‌ల‌ను పండించి, వాటికి సంబంధించిన పిక్స్ కూడా షేర్ చేసింది అనుప‌మ‌.అనుపమ కార్తికేయ 2తో పాటు 18 పేజెస్ చిత్రాల్లో న‌టిస్తుంది.

మలయాళీ కుట్టితో ఉన్న వ్య‌క్తి ఎవరంటే..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts