ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి నుంచి అంటే..?

ఏపీ అసెంబ్లీ సమావేశాన్ని ఈ నెల 20వ తేదీన నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సమావేశాలను ఒక రోజే నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. వరుస ఎన్నికలు, కరోనా వల్ల ఇన్నిరోజులు బడ్జెట్ సమావేశాలు వాయిదా పడ్డాయి. జూన్ 3 లోపు అసెంబ్లీ సమావేశాన్నినిర్వహించడం తప్పనిసరి కావడం వల్ల ఈ నెల 20వ తేదీన నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నెల 21, 22 తేదీల్లో సభ జరిగే అవకాశం ఉంది.

2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను ప్రవేశ పెడతారు. సభ ఎన్ని రోజులు జరపాలన్న దానిపై బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. వాస్తవానికి మార్చిలో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. కరోనా, ఎన్నికల కారణంగా సాధ్యపడలేదు.. దీంతో మార్చి నెలాఖరులో బడ్జెట్ ఆర్డినెన్సుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మూడు నెలల కాలానికి ఏపీ బడ్జెట్ ఆర్డినెన్స్‌ను రూపొందించారు. రూ.80వేల కోట్ల నుంచి రూ.90వేల కోట్ల వరకు మూడు నెలల బడ్జెట్ ఉంటుంది.