ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా.. బుట్ట‌బొమ్మ‌ ఆక్సీమీట‌ర్‌ గురించి ఇలా..!

May 17, 2021 at 2:23 pm
pooja hegde

దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి బారినపడి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక ఇదిలా ఉంటే కరోనా నుండి కోలుకున్న వారిలో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇక రోజురోజుకీ పెరుగుతోన్న కేసులు భ‌యాందోళ‌న‌కు గురిచేస్తుంది. ఈ తరుణంలో ఆరోగ్యంపై అంద‌రిలో అవ‌గాహ‌న పెరుగుతోంది. ముఖ్యంగా క‌రోనా సోకిన వారిలో ఎక్కువ శాతం ఆక్సిజ‌న్ స్థాయిలు ప‌డిపోతుండ‌డంతో మ‌రణాలు సంభ‌విస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఎప్ప‌టిక‌ప్పుడు ఆక్సిజ‌న్ స్థాయిల‌ను ప‌రిశీలించుకుంటూ జాగ్ర‌త్త‌లు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇక తాజాగా న‌టి పూజా హెగ్డే ఆక్సీమీట‌ర్‌ను ఎలా ఉప‌యోగించాలో తెలుపుతూ ఓ వీడియోను షేర్ చేసింది. ఇన్‌స్టా వేదికగా ఓ వీడియోను పోస్ట్ చేస్తూ.. క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన స‌మ‌యంలో తాను తరచూ ఆక్సిజన్‌ లెవెల్స్‌ చెక్‌ చేసుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది పూజా. ఇక డాక్టర్లు చెప్పే వరకు ఆక్సీమీటర్‌ని ఎలా ఉపయోగించాలో అర్థం కాలేద‌ని వెల్లడించింది. ఈ క్ర‌మంలోనే ఆక్సీమీట‌ర్‌ను ఉప‌యోగించే ప‌ద్ధ‌తిని చ‌క్క‌గా వివ‌రించింది.

ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా.. బుట్ట‌బొమ్మ‌ ఆక్సీమీట‌ర్‌ గురించి ఇలా..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts