బాల‌య్య `అఖండ‌` వ‌చ్చేది అప్పుడేన‌ట‌?

May 7, 2021 at 12:39 pm

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో అఖండ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా.. పూర్ణ కీలక పాత్రలో నటిస్తోంది. ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌పై మిర్యాల రవీందర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

ఈ చిత్రాన్ని ఎన్టీ రామారావు జయంతిని పురస్కరించుకుని మే 28న విడుదల చేయాల‌ని భావించారు. అయితే కరోనా ఉదృతి పెరుగుతుండడంతో సినిమా వాయిదా పడింది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ లో విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌. త్వ‌ర‌లోనే ఈ విషయంపై అధికారిక ప్ర‌క‌టన కూడా రానుంద‌ని స‌మాచారం.

బాల‌య్య `అఖండ‌` వ‌చ్చేది అప్పుడేన‌ట‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts