రాకేష్ మాస్టర్ పై కేసు ..?

May 5, 2021 at 3:25 pm

ఎప్పుడు ఎదో ఒక వివాదపు వ్యాఖ్యలు చేస్తూ, సోషల్ మీడియాలో ఎక్కువగా వార్తలో ఉండే డాన్స్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ పై బంజారా హిల్స్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు అయింది. కొద్ది రోజుల క్రితం ఒక యూట్యూబ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిత్ర నృత్య దర్శకుడు ఎస్.రామారావు అదే రాకేష్ మాస్టర్ శ్రీకృష్ణుడి పట్ల కొన్ని వ్యాఖ్యలు చేశారని యాదవ సంఘ నాయకులు ఆరోపించారు.

దీనితో యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు అయిన మేకల రాములు యాదవ్‌, గ్రేటర్‌ అధ్యక్షుడు శ్రీశైలం యాదవ్‌ బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్ లో ఉన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు ఆధారంగా పోలీస్రా వారు రాకేష్‌ మాస్టర్‌ పై ఐపీసీ 295ఎ, 298 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి కేసు ని దర్యాప్తు చేయనున్నారు.

రాకేష్ మాస్టర్ పై కేసు ..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts