ప్రముఖ కమెడియన్‌ కన్నుమూత..!

కరోనాతో చాలా మంది సినీ ప్రముఖులు కన్నుమూస్తున్నారు. వరుసగా సినీ పరిశ్రమలో విషాదాలు నెలకొంటున్నాయి. తాజాగా కోలీవుడ్ ప్రముఖ కమెడియన్‌ పాండు(74) కరోనా కారణంగా గురువారం కన్నుమూశారు. గత కొన్ని రోజుల నుంచి కరోనా కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. చిన్నప్పటి నుంచి సినిమాలపై ఉన్న మక్కువతో నటుడిగా కెరీర్‌ను స్టార్ట్‌ చేసి సినిమాలు చేస్తూ వస్తున్నారు. కమెడియన్‌గా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న పాండుకి డిజైనర్‌గా మంచి పేరుంది.

తమిళనాడులోని ప్రధాన పార్టీ అయిన అన్నా డీఎంకే రెండాకులు గుర్తును పాండునే డిజైన్‌ చేశారు. అలాగే తమిళనాడు టూరిజం లోగోను కూడా ఈయనే డిజైన్‌ చేశారు. పాండు మృతిపై కోలీవుడ్‌ సంతాపాన్ని ప్రకటించింది. సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్‌ ఆయన కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తున్నారు. పాండు తన పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత చిత్రాలపై ఆసక్తిని పెంచుకున్నాడు. అతను 1970 లో మానవన్ తో నటుడిగా అరంగేట్రం చేశాడు. దీనిలో అతను విద్యార్థి పాత్రను పోషించాడు. ‘కరైల్లెం షేన్‌బాగపూ’తో అతనికి మంచి గుర్తింపు వచ్చింది. ఈ చిత్రంలో తన సోదరుడు ఇడిచాపులి సెల్వరాజ్‌తో పాండు స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నాడు.