సాయి ప‌ల్ల‌వితో వార్న‌ర్ స్టెప్పులు..వీడియో వైర‌ల్‌!

ఆస్ట్రేలియా ఓపెన‌ర్, ఐపీఎల్ ఆటగాడు డేవిడ్ వార్న‌ర్ క్రికెట్‌లో ఎంత ఫేమ‌స్ అయ్యాడో.. అంత‌కంటే ఎక్కువ‌గా సోష‌ల్ మీడియాలో పాపుల‌ర్ అయ్యాడు. ముఖ్యంగా గ‌త ఏడాది క‌రోనా కార‌ణంగా లాక్‌డౌన్ విధించ‌డంతో..ఇంటికే పరిమితం అయిన వార్న‌ర్ ఇటు సౌత్ అటు నార్త్ భాష‌ల‌కు చెందిన సినిమాల‌లోని సూప‌ర్ హిట్ సాంగ్స్‌కు, డైలాగ్స్‌కు టిక్ టాక్ వీడియోలు చేసి నెటిజ‌న్స్‌ని అల‌రించాడు.

ఇక ఐపీఎల్‌ 14వ సీజన్‌ రద్దుతో మాల్దీవ్స్‌ నుంచి ఆసీస్‌ చేరుకున్న వార్న‌ర్‌..ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నాడు. ఈ స‌మ‌యంలో మ‌ళ్లీ పాత బాట ప‌ట్టాడు వార్న‌ర్‌. ఇటీవ‌లె అల్లు అర్జున్‌ అల వైకుంఠపురం సినిమాలోని సూపర్‌ హిట్‌ సాంగ్‌ రాములో రాములా పాటకు స్టెప్పులు వేశాడు. అయితే వార్న‌ర్‌ డైరెక్ట్‌గా డ్యాన్స్ వేయ‌క‌పోయినా.. బ‌న్నీ స్థానంలో తన ముఖాన్ని మార్ఫింగ్‌ చేసి వీడియోను రిలీజ్‌ చేశాడు. ఈ వీడియోకు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

తాజాగా సాయి ప‌ల్ల‌వితో స్టెప్పులు వేశాడు వార్న‌ర్‌. ఎన్నో రికార్డుల‌ను నెల‌కొల్పిన‌ రౌడీ బేబీ సాంగ్ ని వార్నర్ మార్ఫింగ్ చేశాడు. డేవిడ్ తనను తాను ధనుష్ గా డీప్ ఫేక్ చేసి.. ఆ వీడియోను పోస్ట్ చేశాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.

https://www.instagram.com/p/CPDPuXKlC27/?utm_source=ig_web_copy_link