ఏపీలో క‌రోనా క‌ట్ట‌డికి సీఎం జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం?

May 17, 2021 at 1:51 pm

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ అల్ల‌క‌ల్లోం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. సెకెండ్ వేవ్‌లో విరుచుకు ప‌డుతున్న ఈ మాయ‌దారి వైర‌స్ దెబ్బ‌కు ప్ర‌జ‌లు పిట్ట‌ల్లా రాలిపోతున్నారు. అలాగే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ క‌రోనా వీర విహారం చేస్తోంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌తి రోజు ఇర‌వై వేల‌కు పైగా పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి.

పాక్షిక లాక్ డౌన్ విధించి రెండు వారాలు గడుస్తున్నా క‌రోనా వేగం త‌గ్గ‌డం లేదు. ఇలాంటి త‌రుణంలో సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క‌రోనా క‌ట్ట‌డికి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న కర్ఫ్యూను ఈ నెలాఖరు వరకు పొడిగిస్తున్న‌ట్టు జ‌గ‌న్ ప్ర‌క‌టించారు.

కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యల ఫలితాలు రావాలంటే కనీసం నాలుగు వారాలు సమయం ఉండాలని..మనం కర్ఫ్యూ విధించి 10 రోజులే దాటిందని సీఎం అభిప్రాయ‌ప‌డ్డారు. అందుకే కర్ఫ్యూను ఈ నెలాఖరు వరకు పొడిగించారు. అంతేకాకుండా.. క‌రోనాతో తల్లిదండ్రులు ఎవరైనా చనిపోతే వారి పిల్లలను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను జ‌గ‌న్ ఆదేశించారు.

ఏపీలో క‌రోనా క‌ట్ట‌డికి సీఎం జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts