రాఘవేంద్రరావుకి చిరు స్పెషల్ విషెష్..!

తెలుగు సినీ పరిశ్రమలోని లెజెండరీ దర్శకుల్లో ఒకరైన కె.రాఘ‌వేంద్ర‌రావు ఈరోజు పుట్టినరోజును జరువుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘రాఘ‌వేంద్ర‌రావు సినీ ప్రస్థానంలో హీరోగా ఎక్కువ సినిమాలు చేసిన వాడిగా నాకు ఒక ప్రత్యేకత లభించింది. మా ఇద్దరి కాంబినేషన్ చాలా స్పెషల్. ఆయన నా స్టార్ డం ను, కమర్షియల్ స్థాయిని పెంచారు. తెలుగు సినిమాల్లో అపురూపంగా నిలిచే జగదేకవీరుడు… లాంటి సినిమాను ఆయన నాకు కానుకగా ఇచ్చారు. ఆయన నూరేళ్లు ఆయురారోగాలతో ఉండాలని ప్రార్థిస్తున్నాను’ అంటూ మెగాస్టార్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.

కె.రాఘ‌వేంద్ర‌రావు దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి అడవిదొంగ, చాణక్య శపథం, కొండవీటి దొంగ, రుద్రనేత్ర, మంచిదొంగ, జగదేక వీరుడు-అతిలోక సుందరి, ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు, ముగ్గురు మొనగాళ్లు, ఇద్దరు మిత్రులు, మంజునాథ సినిమాలు చేశారు. రాఘ‌వేంద్ర‌రావు దర్శకత్వం వహించిన మొదటి సినిమా “బాబు” 1975లో విడుదలైంది. ఆ సినిమాలో శోభన్ బాబు, వాణిశ్రీ, లక్ష్మి ముఖ్య పాత్రల్లో నటించారు.