మంత్రి ఈటల భూ ఆక్రమణల వివాదంలో కీలక మార్పు.. ?

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయిన ఈట‌ల రాజేంద‌ర్ పై భూ క‌బ్జా ఆరోప‌ణ‌లు సంచ‌ల‌నం సృష్టించిన సంగతి అందరికి తెలిసిందే. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట్‌ గ్రామాలకు చెందిన రైతుల భూముల పై మంత్రి ఈటల క‌బ్జా పెట్టార‌నే ఆరోప‌ణ‌లు తెలంగాణ రాజకీయం పై అలజడి రేపింది. అయితే ఈ కేసులో ఇప్పటికే సిఎం కెసిఆర్ విచారణకు ఆదేశాలుఇచ్చారు. ఈ క్రమంలో తాజాగా నేడు మంత్రి ఈటల రాజేందర్ భూ ఆక్రమణల పై విచారణ ప్రారంభం అయింది.

అచ్చంపేట ప్రభుత్వ స్కూల్ కు వచ్చారు ఎమ్మార్వో, విజిలెన్స్ అధికారులు. ఒకవైపు బాధితుల నుంచి సమాచారం తీసుకుంటూనే, మరోవైపు క్షేత్ర స్థాయిలో డిజిటల్ సర్వే చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే ఏడుగురు ఫిర్యాదు చేసినా కూడా మరింత మంది బాధితులు నుంచి ఫిర్యాదులు వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. భారీ బందోబస్తుతో రెవిన్యూ, ఎసిబి, విజిలెన్స్ అధికారులు ఆయన పై విచారం చేస్తున్నారు.