ఈట‌లపై ఎన్నారైల ఆగ్రహం..!

May 5, 2021 at 2:50 pm

మాజీమంత్రి, టీఆర్ ఎస్ తిరుగుబాటు నేత ఈటెల రాజేంద‌ర్ వ్యవహారంపై అమెరికా ఎన్నారైల కోర్ కమిటీ సభ్యులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఈ మధ్య జరుగుతున్న రాజకీయ పరిణామాలు పట్ల ఎన్నారైలు చర్చించి స్థిరమైన సంక్షేమ పాలన కేసీఆర్ తోనే సాధ్యమని, వ్యక్తులు ముఖ్యం కాదు వ్యవస్థ మరియు సమాజహితం ముఖ్యమన్నారు. సబ్బండ వర్గాలకు కెసిఆర్ అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను కొనియాడుతూ కెసిఆర్ గారి నాయకత్వం పై విశ్వాసం వ్యక్తపరుస్తూ ఎన్నారైలు సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఈ సంద‌ర్భంగా ఎన్నారై మహేష్ బిగాల మీడియా తో మాట్లాడుతూ ఈటెల తెరాస పార్టీకి ఎప్పటినుంచో ద్రోహం చేస్తున్నార‌ని, వెన్నంటి వుంటూనే తెరాస పార్టీని కూల్చే ప్రయత్నములో విఫల యత్నం చేశార‌ని ధ్వ‌జ‌మెత్తారు. కెసిఆర్ గారి నిర్ణయం శిరోధారం , అయన ఏ పిలుపు ఇచ్చిన తెలంగాణ బాగోగుల గురించే , బంగారు తెలంగాణ సాధనలో ఎవ్వరైనా అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నం చేస్తే వాళ్ళకే ముప్పు , తెలంగాణ కి నష్టం చేసే ఎవ్వరినైనా క్షమించేది లేద‌ని హెచ్చ‌రించారు.

మహేష్ బిగాల చెబుతూ ప్రపంచ వ్యాప్తంగా వున్నా ఎన్నారై మిత్రులతో మాట్లాడి అందరి అభిప్రాయం తెలుసుకున్నామ‌ని, అందరూ మా నాయకుడు కెసిఆర్ అని గంట పదంగా చెప్పార‌ని, స్థిరమైన సంక్షేమ పాలన కేసీఆర్ తోనే సాధ్యమని, వ్యక్తులు ముఖ్యం కాదు వ్యవస్థ మరియు సమాజహితం ముఖ్యమని వివ‌రించార‌ని తెలిపారు. సబ్బండ వర్గాలకు కెసిఆర్ అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను కొనియాడుతూ కెసిఆర్ గారి నాయకత్వం పై విశ్వాసం వ్యక్తపరుస్తూ ఎన్నారైలు సంపూర్ణ మద్దతు తెలియజేశారు. అదేవిధంగా దేశంలో ఏర్పడిన తీవ్ర కరోనా సంక్షోభం పట్ల ప్రవాస తెలంగాణ సమాజం, తెరాస అమెరికా విభాగం, ప్రవాస తెలంగాణ ప్రముఖులు తెలంగాణ సమాజానికి తమ బాధను మరియు బాధితులకు సంతాపాన్ని తెలియజేశారు. తెలంగాణాలో వివిధ ఎన్నారై స్వచ్ఛంద సేవా సంస్థలు మరియు వ్యక్తులు చేస్తున్న సేవ కార్యక్రమాలను కొనియాడారు. ఎన్నారైలు సహాయ కార్యక్రమాలు చేపట్టి కరోనా బాధితులను ఆదుకోవడానికి ఆక్సిజన్ కన్సన్ట్రేటర్స్ మరియు కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేశారన్నారు. ఈ చర్చలో మహేష్ బిగాల గారితో తెరాస అమెరికా కోర్ కమిటి సభ్యులు మహేష్ తన్నీరు , చందు తాళ్ల, పూర్ణ బైరి, శ్రీనివాస్ గనుగొని, వెంగల్ జలగం, భాస్కర్ పిన్న, మహేష్ పొగాకు, రిషికేష్ రెడ్డి, వెంకట్ గౌడ్ పాల్గొన్నారు. ఇదిలా ఉండ‌గా నాడు నేడు రేపు ఎన్ఆర్ఐ లు కేసిఆర్ వెంటే ఉంటార‌ని టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి సైతం ప్ర‌క‌టించారు.

ఈట‌లపై ఎన్నారైల ఆగ్రహం..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts