టీడీపీలో తీవ్ర విషాదం.. కరోనాతో మాజీ ఎమ్మెల్సీ మృతి!

May 2, 2021 at 8:51 am

క‌రోనా వైర‌స్ అల్ల‌క‌ల్లోలం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు సామాన్యులు, సెల‌బ్రెటీలు, రాజ‌కీయ నాయ‌కులు అనే తేడా లేకుండా అంద‌రూ బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా తెలుగు దేశంలో పార్టీలో తీవ్ర విషాదాన్ని నింపింది క‌రోనా.

తూర్పుగోదావరి జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు కన్నుమూశారు. ఇటీవ‌లె ఈయ‌న క‌రోనా బారిన ప‌డ‌తా.. విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. అక్క‌డ చికిత్స పొందుతూ ఇవాళ తెల్ల‌వారుజామున క‌న్నుమూశారు.

దీంతో బొడ్డు భాస్క‌ర రామారావు మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ నేతలు, కార్యకర్తలు సంతాపాన్ని తెలిపారు. కాగా, 1984లో జడ్పీ చైర్మన్‌గా టీడీపీ తరపున రామారావు సేవలందించారు. అలాగే 1994, 2004లో పెద్దాపురం ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2012-17 వరకు ఎమ్మెల్సీగా బొడ్డు భాస్కర రామారావు పనిచేశారు.

టీడీపీలో తీవ్ర విషాదం.. కరోనాతో మాజీ ఎమ్మెల్సీ మృతి!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts