అభిమానుల‌కు గుడ్‌న్యూస్ చెప్పిన సింగ‌ర్ సునీత‌!

May 9, 2021 at 8:01 am

ప్ర‌ముఖ గాయ‌ని, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ సునీత గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మధురమైన గొంతుతోనే కాదు చూడచక్కని రూపంతోను ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేసే సునీత‌.. ఇటీవ‌లె ప్ర‌ముఖ‌ పారిశ్రామిక వేత్త రామ్ వీరపనేనిని రెండో వివాహం చేసుకుంది.

అప్ప‌టి నుంచి సునీత‌కు సంబంధించిన ప్ర‌తి విష‌యం సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఇక పెళ్లి త‌ర్వాత సోష‌ల్ మీడియాలో సూప‌ర్ యాక్టివ్‌గా క‌నిపిస్తున్న సునీత‌.. గ‌త రాత్రి ఇన్స్టాగ్రామ్ లైవ్‌లోకి వ‌చ్చి అభిమానుల‌తో ముచ్చ‌టించారు. నెటిజన్ల కామెంట్లకు బదులు ఇస్తూనే.. వారు కోరిన పాటలన్నీ లైవ్‌లోనే ఆలపించారు.

అంతేకాదు, ఈ లైవ్‌లో ఓ గుడ్‌న్యూస్ కూడా చెప్పారు. కరోనా నేపథ్యంలో అందరికీ కొంచెం రిలీఫ్ కలిగించేందుకు ప్రతిరోజూ రాత్రి ఎనిమిది గంటల నుంచి 30 నిమిషాలపాటు ఇన్‌స్టా లైవ్‌లోకి వస్తానని.. నెటిజన్లు కోరిన పాటల్ని పాడి వినిపిస్తానని ఆమె చెప్పారు. దీంతో ఆమె అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

అభిమానుల‌కు గుడ్‌న్యూస్ చెప్పిన సింగ‌ర్ సునీత‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts