బాలీవుడ్ ఎంట్రీకి అదే అడ్డంకి..సీక్రెట్స్ రివిల్ చేసిన నాని!

టాలీవుడ్ న్యాచుర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం వ‌రుస సిసిమాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో టక్ జగదీష్ చిత్రాన్ని పూర్తి చేసిన నాని.. రాహుల్ సాంకృత్యాయన్ డైరెక్ష‌న్‌లో శ్యామ్ సింగరాయ్, వివేక్ ఆత్రేయ డైరెక్ష‌న్‌లో అంటే సుందరానికి..! చిత్రాల‌ను చేస్తున్నారు.

ప్ర‌స్తుతం ఈ రెండు చిత్రాలు సెట్స్ మీద ఉన్నాయి. ఇదిలా ఉంటే..ఈ మ‌ధ్య కాలంలో చాలా మంది హీరోలు తమ మార్కెట్ ను ఇత‌ర భాష‌ల్లో కూడా పెంచుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే కొంద‌రు పాన్ ఇండియా సినిమాలు చేస్తుంటే.. మ‌రికొంద‌రు డైరెక్ట్ గా ఇత‌ర భాష‌ల్లో సినిమాలు చేస్తున్నారు. అయితే నానికి కూడా బాలీవుడ్ కు వెళ్లాలని ఎప్ప‌టి నుంచి ఆశ ఉంద‌ట‌.

కానీ, ఆయన బాలీవుడ్ ఎంట్రీకి ఓ విష‌యం పెద్ద అడ్డంకిగా మారింద‌ట‌. అది మరెదో కాదు.. నానికి హిందీ భాష రాకపోవడమే. తనకు ఉన్న హిందీ పరిజ్ఞానంతో బాలీవుడ్‌లో సినిమాలు చేయడం కష్టమని సీక్రెట్ రివిల్ చేశాడు నాని. అయితే హిందీ మేక‌ర్స్ ఎవ‌రైన క‌థ తీసుకొచ్చి నన్ను ఇంప్రెస్ చేస్తే త‌ప్ప‌కుండా చేస్తా. కానీ ఆ క‌థ ఎలా ఉండాలి అంటే సినిమా కోసం హిందీ నేర్చుకోవాల‌నే త‌పన నాలో పుట్టించేలా ఉండాలి. ఆ కథ కోసం తాను కొత్తగా తయారయ్యేలా ఉండాలి అని నాని చెప్పుకొచ్చాడు.