కొత్త వ్యాపారంలోకి దిగుతున్న ఇలియానా?!

May 18, 2021 at 8:45 am

ఇలియానా.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. దేవ‌దాసు సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టిన ఈ భామ‌.. త‌క్కువ స‌మ‌యంలో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుని స్టార్ హీరోలంద‌రి స‌ర‌స‌న ఆడిపాడింది. ఇక తెలుగులోనే కాకుండా త‌మిళం, క‌న్న‌డ, హిందీ భాష‌ల్లోనూ న‌టించి గుర్తింపు తెచ్చుకుంది.

అయితే ప్ర‌స్తుతం ఈ గోవా బ్యూటీ క్రేజ్ బాగా త‌గ్గిపోయింది. బాలీవుడ్ సహా దక్షిణాది లోనూ మరోసారి సత్తా చాటాలని ప్ర‌యత్నిస్తున్నా.. హీరోలు ఈమెవైపే చూడ‌టం లేదు. ఎలాగూ సరైన అవకాశాలు లేవు కాబట్టి ఇలియానా కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంటుంద‌ట‌.

త్వ‌ర‌లోనే ఈ అమ్మడు బేకరీ, రెస్టారెంట్లు వంటి చైన్‌ బిజినెస్‌ చేయాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం. తన పేరుతోనే వీటిని మార్కెట్ చేసుకోవాలనుకుంటుందట. క‌రోనా ప‌రిస్థితులు చ‌క్కబ‌డిన త‌ర్వాత ఈ వ్యాపారం స్టార్ట్ చేయ‌నుంద‌ట‌. కాగా, ఇప్పటికే ఇలియానా పేరుతో డిజైనర్ గార్మెంట్స్ బోటిక్ ఉన్న సంగతి తెలిసిందే. ముంబై, హైదరాబాద్‌లలో ఈ బ్రాంచెస్ ఉన్నాయి.

కొత్త వ్యాపారంలోకి దిగుతున్న ఇలియానా?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts