ఆ సినిమా కోసం బాలీవుడ్ బ్యూటీ..?

May 4, 2021 at 2:50 pm

యష్‌ హీరోగా ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్‌-చాప్టర్‌ 1 దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా కేజీఎఫ్‌-2 చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మొదటి పార్ట్కి వచ్చిన క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని కేజీఎఫ్‌-2 చిత్రం సీక్వెల్‌ను మరింత భారీగా తీర్చిదిద్దుతున్నారు మేకర్స్. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఈ మూవీలో ప్రేక్షకుల్ని ఉర్రూతలూలించేలా ఒక మంచి ఐటెంసాంగ్‌ని ప్లాన్ చేస్తున్నారట.

ఇందులో బాలీవుడ్‌ అందాల బ్యూటీ అయిన జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ నర్తించనున్నట్లు సమాచారం. ఈ భామతో పాటు యువ నాయిక నోరా ఫతేహి పేరు కూడా పరిశీలిస్తున్నారట మేకర్స్. జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ ఇది వరుకు హౌస్‌ఫుల్‌, భాగీ-2, సాహో వంటి చిత్రాల్లో ఐటెంసాంగ్స్‌లో చేసి అందరిని అలరించింది. అటు బాలీవుడ్‌తో పాటు ఇటు దక్షిణాదిలో కూడా ఈ భామకి మంచి ఫాలోయింగ్‌ ఉండటంతో ఈ చిత్రంలో ఐటెంసాంగ్‌ కోసం ఆమె పేరును ఖరారు చేయొచ్చని టాక్ వినిపిస్తుంది.

ఆ సినిమా కోసం బాలీవుడ్ బ్యూటీ..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts