నెటిజ‌న్ల తిట్ల‌కు బెదిరిపోయిన జాన్వీ..తీవ్ర ఆవేద‌న!

May 5, 2021 at 8:17 am

అల‌నాటి అందాల తార శ్రీ‌దేవి కూతురు జాన్వీ క‌పూర్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. దఢక్ సినిమాతో బాలీవుడ్ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన జాన్వీ..ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే జాన్వీ.. ఇటీవ‌ల బీచ్ ఒడ్డున దిగిన కొన్ని ఫొటోల‌ను షేర్ చేసింది.

ఈ ఫొటోల్లో జాన్వీ సూప‌ర్ హాట్‌గా క‌నిపిస్తుంది. అయితే ఈ ఫొటోలు చూసిన ప‌లువురు నెటిజ‌న్లు జాన్వీపై విమ‌ర్శ‌లు వ్య‌క్తం చేశారు. క‌రోనాతో దేశం అల్లాడిపోతుంటే ఇలాంటి ఫొటో షూట్లు చేయ‌డం అవ‌స‌ర‌మా? అంటూ తిట్టిపోశారు. ఇక నెటిజ‌న్ల దెబ్బ‌కు బెదిరిపోయిన జాన్వీ.. వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది.

ఆ ఫొటోలు ఇప్పుడు తీసిన‌వి కావ‌ని గ‌తంలో ఎప్పుడో తీసిన ఫొటోలని, ఓ మ్యాగ‌జైన్ కోసం దిగిన ఫొటోషూట్ అంటూ చెప్పుకొచ్చింది. త‌న‌ను అపార్థం చేసుకున్నార‌ని తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ఇక త‌న‌కూ సామాజిక బాధ్యత గురించి బాగా తెలుసని చెప్పుకొచ్చింది.

నెటిజ‌న్ల తిట్ల‌కు బెదిరిపోయిన జాన్వీ..తీవ్ర ఆవేద‌న!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts