క‌రోనా దెబ్బ‌కు తోట‌ల్లోనే ఉంటున్న ప్ర‌ముఖ హీరోయిన్‌!

May 5, 2021 at 7:51 am

దేశ ప్ర‌జ‌ల‌ను మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకు ప‌డుతున్న క‌రోనా ఎవ‌ర్నీ వ‌దిలి పెట్ట‌డం లేదు. సామాన్యులు, సెల‌బ్రెటీలు, రాజకీయ నాయ‌కులు, క్రీడా కారులు ఇలా అంద‌రిపై క‌రోనా పంజా విసురుతోంది.

Image

ఇక క‌రోనా దెబ్బ‌కు భ‌య‌ప‌డిన బాలీవుడ్‌ సీనియర్‌ హీరోయిన్‌ జుహీ చావ్లా ముంబైలోని వాడా ఏరియాలో ఉన్న తన తోటల్లోనే నివాసం ఉంటోంది. అక్క‌డ‌ ఆఫీస్‌ ఒకటి ఏర్పాటు చేసి అక్కడి నుంచే కార్యకలాపాలు కూడా కొనసాగిస్తున్నారు.

Image

ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆమెనే తెలిపింది. `వాడా ఫామ్‌లో మా కొత్త ఆఫీస్‌. ఇక్కడ గాలికి, ఆక్సిజన్‌కి ఎటువంటి లోటులేదు. కొత్తగా మేము గోశాల‌, స్టాఫ్‌కి క్వార్టర్స్‌ మరియు అధికంగా పండ్ల మొక్కలను నాటాలని ప్లాన్‌ చేస్తున్నాం.` అని తెలిపింది. కొన్ని ఫొటోల‌ను కూడా షేర్ చేసింది.

క‌రోనా దెబ్బ‌కు తోట‌ల్లోనే ఉంటున్న ప్ర‌ముఖ హీరోయిన్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts