ఎన్టీఆర్ కి ఇష్టమైన అలవాటు ఏంటో తెలుసా..?!

May 26, 2021 at 2:52 pm

గత సంవత్సరం, అలాగే ప్రస్తుతం కరోనా వైరస్ దెబ్బకి భారతదేశంలోని చిత్ర పరిశ్రమల అన్ని కూడా పని చేయకపోవడంతో ప్రస్తుతం సినిమా రంగం చెందిన ప్రముఖులందరూ పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. వారు ఇంట్లోనే ఉండి వారి కుటుంబ సభ్యులతో గడుపుతూనే వారి అభిమానుల కోసం అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కనపడుతూ వారిని ఖుషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే వారు వారి పర్సనల్ విషయాలు, అలాగే కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ అభిమానులను సంతోష పరుస్తున్నారు. మొత్తంగా అన్ని చిత్ర పరిశ్రమల నటీనటులు ఇంట్లోనే ఉండు వారికి నచ్చిన హాబీస్ చేస్తూ ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక అసలు విషయంలోకి వెళితే జూనియర్ నందమూరి తారకరామారావు విషయానికి వస్తే తాజాగా కరోనా వైరస్ నుండి ఆయన కోలుకున్నారు.

ఇక ఈయన ఇంట్లో ఉంటూ తనకు నచ్చిన పనిని చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కి ఉన్న హాబి ఏంటో మీకు ఇప్పటికే తెలిసి ఉంటుంది కదా..? అదేనండి జూనియర్ ఎన్టీఆర్ తన ఖాళీ సమయంలో వంట చేయడం అంటే చాలా ఇష్టం. ఆయన తన ఫ్యామిలీ కోసం ఖాళీ సమయంలో పూర్తిగా చెఫ్ గా మారిపోయి కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తారు.

ఎన్టీఆర్ కి ఇష్టమైన అలవాటు ఏంటో తెలుసా..?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts