త‌మిళుల దెబ్బ‌కు కమల్ కీల‌క నిర్ణ‌యం..?!

May 8, 2021 at 8:54 am

మక్కల్ నీది మయ్యమ్ పార్టీని స్థాపించిన సినీ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్‌.. ఇటీవ‌ల జ‌రిగిన త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నికల బ‌రిలో దిగి తొలిసారి త‌న అదృష్టాన్ని ప‌రిక్షించుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ ఎన్నిక‌ల్లో కమల్‌ను త‌మిళులు ఊహించ‌ని దెబ్బ కొట్టారు. క‌మ‌ల్‌తో స‌హా పార్టీ అభ్య‌ర్థులు త‌మిళ‌నాడులో ఒక్క‌టంటే ఒక్క సీటు కూడా గెలుచుకోలేక‌పోయారు.

ఈ ఎన్నికల్లో దారుణ ఓటమి తర్వాత కమల్ హాసన్ కు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఓటమి తర్వాత పదిమంది ముఖ్యనేతలు పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ఉపాధ్యక్షుడు మహేంద్రన్‌ సైతం తప్పుకొంటున్నట్టు ప్రకటించారు.

ఇలాంటి త‌రుణంలోనే క‌మ‌ల్ రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారంటూ కోలీవుడ్‌ వర్గాల్లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ మేరకు ఆయన త్వరలోనే నిర్ణయం వెలువరించనున్నారని వార్త‌లు వ‌స్తున్నాయి.

త‌మిళుల దెబ్బ‌కు కమల్ కీల‌క నిర్ణ‌యం..?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts