క‌రోనా బారిన ప‌డ్డ బాలీవుడ్ ఫైర్ బ్రాండ్‌!

May 8, 2021 at 11:37 am

కంటికి క‌నిపించ‌ని క‌రోనా వైర‌స్ సెకెండ్ వేవ్‌లో దేశ ప్ర‌జ‌ల‌ను ఏ స్థాయిలో అత‌లా కుత‌లం చేస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ క్ర‌మంలోనే రోజు రోజుకు ల‌క్ష‌ల సంఖ్య‌లో క‌రోనా కేసులు న‌మోదు అవుతున్నాయి. సామాన్య ప్రజలు మాత్రమే కాదు రాజకీయ, సినీ ప్రముఖులు కూడా క‌రోనా బారిన ప‌డుతూ నానా ఇబ్బందుల‌ను ఎదుర్కొంటున్నారు.

తాజాగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్‌, కాంట్రవర్సీ క్వీన్ కంగ‌నా ర‌నౌత్ కు కూడా కరోనా సోకింది. త‌న‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింద‌నే విష‌యాన్ని ఆమెనే స్వ‌యంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్ల‌డించింది. `గ‌త కొన్ని రోజుల నుంచి క‌ళ్లు మండుతున్నాయి. అల‌స‌ట‌గా, నీర‌సంగా అనిపించేది.

అందుకే హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌కు వెళ‌దామ‌ని కొవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. ఆ టెస్టుల్లో క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దాంతో నేను సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉంటున్నాను` అని కంగ‌నా తెలిపింది. దీంతో కంగ‌నా అభిమానులు.. ఆమె త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కామెంట్స్ చేస్తున్నారు.

క‌రోనా బారిన ప‌డ్డ బాలీవుడ్ ఫైర్ బ్రాండ్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts