అప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భాస్ పెళ్లి లెన‌ట్టేనా..ఆందోళ‌న‌లో ఫ్యాన్స్‌?

May 9, 2021 at 9:14 am

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ లిస్ట్‌లో ఫ‌స్ట్ ఉండే పేరు రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌దే. ఈయ‌న పెళ్లి ఎప్పుడెప్పుడు జ‌రుగుతుందా అని అభిమానులు ఎన్నో ఏళ్లుగా వెయిట్ చేస్తున్నారు. కానీ, 40 ఏళ్లు దాటినా ప్ర‌భాస్ పెళ్లి ఊసే ఎత్త‌డం లేదు. బాహుబ‌లి పూర్తి కాగానే ప్ర‌భాస్ పెట్టి ఉంటుంద‌ని అంద‌రూ భావించారు.

బాహుబ‌లి త‌ర్వాత సాహో కూడా విడుద‌లైంది. కానీ, ప్ర‌భాస్ పెళ్లి కాలేదు. అయితే ప్ర‌స్తుత ప‌రిస్థితులు చూస్తుంటే 2025 వ‌ర‌కు ప్ర‌భాస్ పెళ్లి జ‌ర‌గ‌డం కాస్త క‌ష్ట‌మేన‌ని అంటున్నారు. రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రాధేశ్యామ్ చేస్తున్న ప్ర‌భాస్‌.. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో స‌లార్‌, ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో ఆదిపురుష్ చిత్రాల‌ను కూడా సెట్స్ మీద‌కు తీసుకెళ్లాడు.

ఈ చిత్రాల త‌ర్వాత నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ బ‌డ్జెట్ చిత్రం చేయ‌బోతున్నాడు ప్ర‌భాస్‌. ఇక ఈ చిత్రాల‌న్నీ పూర్తి అవ్వాలంటే 2025 వరకు ప్ర‌భాస్ క్ష‌ణం తీరిక లేకుండా షూటింగ్స్‌లో పాల్గొనాల్సిందే. మ‌రి ఇంత బిజీ షెడ్యూల్స్ మ‌ధ్య ప్ర‌భాస్ పెళ్లి జ‌ర‌గ‌డం అనేది క‌లే అని అంటున్నారు. అందుకే ఆయ‌న ఫ్యాన్స్ ఆందోళ‌న చెందుతున్న‌ట్టు టాక్‌.

అప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భాస్ పెళ్లి లెన‌ట్టేనా..ఆందోళ‌న‌లో ఫ్యాన్స్‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts