బ్రేకింగ్ : రెజ్లర్ సుశీల్​ కుమార్​ కు ​నోటీసులు.

May 10, 2021 at 12:38 pm

ఇటీవల ఛత్రశాల్​ స్టేడియంలో జరిగిన వివాదంలో సాగర్​ రానా అనే మల్లయోధుడు మృతి చెందిన సంగతి అందరికి విదితమే . ఈ మర్డర్​ కేసులో భాగంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టార్ రెజ్లర్​ సుశీల్​ కుమార్​కు ఢిల్లీ పోలీసులు తాజాగా లుక్​ఔట్​ నోటీసులు జారీచేశారు. ఛత్రసాల్​ స్టేడియంలో సాగర్​ రానా అనే మల్లయోధుడి పై జరిగిన హత్యకి సుశీల్​కు సంబంధాలున్నట్లు పోలీసులు గ్రహించడంతో ​ సుశీల్​ కుమార్​కు లుక్​ ఔట్​ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.

కేసు లో భాగంగా దాడుల్లో రెజ్లర్ సుశీల్​ కూడా ఉన్నట్లు అక్కడ ఉన్న బాధితుల్లో ఒకరు తెలిపినట్లు సమాచారం. బాధితుల ఇచ్చిన స్టేట్మెంట్ బట్టి, ఈ హత్య కేసులో సుశీల్​ హస్తం కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించి సుశీల్​ కోసం తీవ్రంగా గాలింపు చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా సుశీల్​ కోసం వెతుకుతున్న పోలీసులకు అతను ఎక్కడ ఉన్నది తెలీకపోవటంతో, తాజాగా తన పై లుక్​ఔట్​ నోటీసులు జారీ చేశారు. పోలీసులు ఇంకా స్టేడియంలో ఉన్న సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం .

బ్రేకింగ్ : రెజ్లర్ సుశీల్​ కుమార్​ కు ​నోటీసులు.
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts