రా ఏజెంట్ పాత్రలో ప్రిన్స్..?

May 4, 2021 at 3:30 pm

టాలీవుడ్ హీరో ప్రిన్స్ మహేష్‌బాబు హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం మనకి తెలిసిందే. అతడు, ఖలేజా వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఈ చిత్రం పై అటు అభిమానులతో పాటు సినీ వర్గాల్లో కూడా ఆసక్తిని రేపుతోంది. సూర్యదేవర రాధాకృష్ణ అలియాస్ చినబాబు నిర్మించనున్న ఈ మూవీ ఈ నెల 31న పూజా కార్యక్రమాలతో మొదలు కానుంది. ఈ చిత్రంలో మహేష్‌బాబు రా ఏజెంట్‌గా మొదటిసారి కనిపించనున్నట్లు సమాచారం.

దేశ రక్షణ కొరకు గూఢచర్యం నెరిపే రా ఏజెంట్‌గామహేష్ బాబు పాత్ర చాలా విలక్షణంగా ఉంటుంది అని అన్నారు. మహేష్‌బాబు పాత్ర గతంలో ఎన్నడూ చూడని విధంగా ఉంటుందని టాక్. మహేష్కె బాబు కెరీర్ లో మొదటి సారిగా రాఏజెంట్ పాత్రను పోషిస్తుండటం చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు.వచ్చే సంవత్సరం వేసవికి ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్ .

రా ఏజెంట్ పాత్రలో ప్రిన్స్..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts