త్రివిక్ర‌మ్ సినిమాకు మ‌హేష్ భారీ రెమ్యున‌రేష‌న్?!

May 5, 2021 at 1:12 pm

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం స‌ర్కారు వాటి పాట సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.

ఇది పూర్తి కాగానే స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయ‌నున్నాడు మ‌హేష్‌. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. కృష్ణ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమాను ఈ నెల 31వ తేదీన లాంఛనంగా ప్రారంభించనున్నారు.

ఇదిలా ఉంటే..ఈ చిత్రానికి మ‌హేష్ రెమ్యూన‌రేష‌న్ భారీగానే తీసుకుంటున్నార‌ట‌. రూ. 60 నుంచి రూ. 70 కోట్ల వ‌ర‌కు మ‌హేష్ పుచ్చుకుంటున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌ముందో తెలియాల్సి ఉంది.

త్రివిక్ర‌మ్ సినిమాకు మ‌హేష్ భారీ రెమ్యున‌రేష‌న్?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts