ఓటీటీ లో నయన్ ‘నిజల్’..?

May 7, 2021 at 12:24 pm

సౌత్ లో లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నటి నయనతార. తెలుగు తమిళ్ భాషల్లో వరుసగా మూవీస్ చేస్తూ విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది.ఇప్పుడు ఈ భామ మలయాళంలో కూడా రాణిస్తుంది. నయనతార నిజల్ అనే మలయాళ చిత్రం చేసింది. ఈ మూవీలో చాకో బోబన్న, నయనతార హీరో హీరోయిన్లుగా నటించగా సైజు కురుప్, దివ్య ప్రభా, రోనీ డేవిడ్ ముఖ్య పాత్రల్లో నటించారు.

ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ వేదికగా విడుదల కానుంది. మే 9న ఈ చిత్రం ఓటీటీ లో ప్రేక్షకుల అలరించటానికి వస్తుంది. మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి అప్పు ఎన్ భట్టతిరి దర్శకత్వం వహించారు. ఇక మలయాళంలో నయనతార చివరిసారిగా 2019 లవ్ యాక్షన్ డ్రామా అనే మూవీ లో కనిపించి అలరించింది. అక్కడి స్టార్ హీరోగా పేరున్న నివిన్ పౌలీతో కలిసి చేసింది నయనతార. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రానికి ధ్యాన్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించారు.

ఓటీటీ లో నయన్ ‘నిజల్’..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts