అడ్డంగా బుక్కైన మంచు లక్ష్మి..ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్లు!

May 9, 2021 at 8:25 am

మంచు లక్ష్మి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. చేసింది త‌క్కువ సినిమాలే అయినా.. ప్రేక్ష‌కుల్లో బాగానే క్రేజ్ సంపాదించుకుంది. అయితే ఈ మ‌ధ్య కాలంలో ఈమె పెట్టే పోస్టుల‌న్నీ వ్యంగ్యంగా ఉండ‌టంతో..నెటిజన్లు తమదైన శైలిలో కౌంటర్లు వేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు.

దీంతో మంచు ల‌క్ష్మి త‌ర‌చూ ట్రోలింగ్‌కు గుర‌వుతూ.. వార్త‌ల్లో నిలుస్తోంది. తాజాగా కూడా ఈ అమ్మ‌డు అడ్డంగా బుక్కైంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..మంచు లక్ష్మీ యశోద హాస్పిటల్‌లో ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ వేయించుకుంది. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా తెలిపిన ల‌క్ష్మి..ఎవరైతే పద్దెనిమిదేళ్లు నిండిన వారున్నారో వారంతా వ్యాక్సిన వేసుకోవాలని సూచించింది.

అయితే తెలంగాణలో ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ వేయడం ఆపేశారు. కేవలం రెండో డోస్ వేసుకునే వాళ్లకే వ్యాక్సిన్ ఇస్తున్నామని ఇటీవ‌లె ప్రభుత్వం ప్రకటించింది. మ‌రి మంచు లక్ష్మికి ఫ‌స్ట్ డోస్ వ్యాక్సిన్ ఎలా వేశారు? అని నెటిజ‌న్లు తెలంగాణ సీఎం, కేటీఆర్‌లను ట్యాగ్ చేస్తూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. మంచు ల‌క్ష్మికి మాత్ర‌మే స్పెష‌ల్‌గా వేస్తున్నారేమో అంటూ మ‌రికొంద‌రు ట్రోల్ చేస్తున్నారు.

Lakshmi Manchu (@LakshmiManchu) | Twitter

అడ్డంగా బుక్కైన మంచు లక్ష్మి..ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్లు!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts