ప‌వ‌న్ సినిమాలో బంప‌ర్ ఛాన్స్ కొట్టేసిన నాని హీరోయిన్‌?!

May 3, 2021 at 7:25 am

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో మలయాళ సూపర్‌హిట్ చిత్రం అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ రీమేక్ ఒక‌టి. సాగర్‌. కె. చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో మ‌రో హీరోగా రానా ద‌గ్గుబాటి న‌టిస్తున్నారు. ఇటీవ‌లె ఈ చిత్రం సెట్స్ మీద‌కు కూడా వెళ్లింది.

ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, డైలాగులు త్రివిక్రమ్ శ్రీ‌నివాస్‌ అందిస్తున్నారు. ఇక ఇప్ప‌టికే రానాకు జోడీగా ఐశ్వర్య రాజేష్‌ సెలెక్ట్ అయిన సంగ‌తి తెలిసిందే. కానీ, ప‌వ‌న్ హీరోయిన్ ఎవ‌ర‌న్న‌ది క్లారిటీ రాలేదు. అయితే ఆ బంప‌ర్ ఛాన్స్‌ టాలెంట‌డ్ న‌టి నిత్యామీనన్ కొట్టేసింది. ప‌వ‌న్‌కు జోడీగా నిత్యామీనన్‌ను ఎంపిక చేసిన‌ట్టు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం ద్వారా తెలుస్తోంది.

ఇప్ప‌టికే సంప్ర‌దింపులు పూర్తి అయ్యాయ‌ని.. క‌రోనా సెకెండ్ వేవ్ కాస్త నెమ్మ‌దించాక నిత్యా షూటింగ్‌లో పాల్గోనుంద‌ని తెలుస్తోంది. కాగా, నాని హీరోగా తెర‌కెక్కిన అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నిత్యా.. చాలా త‌క్కువ స‌మ‌యంలోనే సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది.

Nithya Menon : Biography, wiki, age, height, wallpapers, husband, info

ప‌వ‌న్ సినిమాలో బంప‌ర్ ఛాన్స్ కొట్టేసిన నాని హీరోయిన్‌?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts