దృశ్యం 2 హిందీ రీమేక్‌లో హీరో ఎవరు..?

May 5, 2021 at 1:05 pm

మోహ‌న్ లాల్, మీనా ప్ర‌ధాన పాత్ర‌లో జీతూ జోసెఫ్ తెర‌కెక్కించిన సినిమా దృశ్యం 2. క‌రోనా కార‌ణంగా మూవీ థియేటర్స్ మూతపడి ఉండటం వల్ల ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ అయ్యి ఘన విజ‌యం పొందింది. చివరికి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లను కూడా ఈ చిత్రం అందుకుంది. కాబట్టి ఇప్పుడు ఈ చిత్రాన్ని ప‌లు భాష‌ల‌లో రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్ప‌టికే తెలుగులో రీమేక్ చేశారు.

తెలుగు రీమేక్ లో వెంక‌టేష్‌, మీనా ప్ర‌ధాన పాత్ర‌లో నటించారు. ఇక ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీలో కూడా రీమేక్ చేసేందుకు అంత రెడీ చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన పనోరమ స్టూడియోస్‌ ఈ మూవీ హిందీ రీమేక్‌ హక్కులు సొంతం చేసుకుంది. ఈ సంగతిని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన నటి నటులు వివరాలు వెల్లడిస్తామన్నారు మేకర్స్. ఈ మూవీ సీక్వెల్‌లో ఎవ‌రిని ఎంపిక చేస్తారో వేచి చూడాలి.

దృశ్యం 2 హిందీ రీమేక్‌లో హీరో ఎవరు..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts