అనుప‌మపై ప‌వ‌న్ ఫ్యాన్స్ ఆగ్ర‌హం..సారీ చెప్పిన బ్యూటీ!

May 4, 2021 at 7:38 am

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అ ఆ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన అనుప‌మ‌.. ఎలాంటి ఎక్స్‌పోజింగ్ చేయ‌కుండా త‌న‌దైన అందం, అభిన‌యం, న‌ట‌న‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే అనుప‌మ‌.. తాజాగా ఓ పోస్ట్ పెట్టింది.

అమేజాన్ ప్రైమ్‌లో వ‌కీల్ సాబ్ చూసిన‌ట్టు అనుప‌మ ఈ పోస్ట్ ద్వారా తెలిపింది. తాజాగా వ‌కీల్‌సాబ్‌ను చూశాను. మంచి సందేశంతో వ‌చ్చిన ఈ సినిమాలో అంద‌రి న‌ట‌న అద్భుతంగా ఉంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ముగ్గురు అమ్మాయిల‌ను కాపాడే పాత్ర‌తో హ‌ద్దుల‌ను చెరిపేశారు. ప్ర‌కాశ్ రాజ్ స‌ర్‌.. మీ న‌ట‌న అద్భుతం అంటూ ఆ పోస్ట్ క్యాప్ష‌న్ జోడించింది.

అయితే ఈ పోస్ట్ చూసిన ప‌వ‌న్ అభిమానులు.. అనుప‌మ‌పై మండిప‌డుతున్నారు. ఎందుకంటే, ఆ పోస్ట్‌లో కేవ‌లం ప్రకాశ్ రాజ్‌నే సార్ అని సంబోధించింది. ప‌వ‌న్‌కు మాత్రం ఎలాంటి గౌర‌వం ఇవ్వ‌లేదు. అందుకే ప‌వ‌న్ ఫ్యాన్స్ ఆమెపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దాంతో అనుప‌మ నాలుక‌ క‌రుచుకొని..న‌న్ను క్ష‌మించండి నా త‌ప్పును తెలుసుకున్నాను. ప‌వ‌న్ కళ్యాణ్ గారిపై నా ప్రేమ‌, గౌర‌వం ఎప్పుడూ ఉంటుంది అని మ‌రో ట్వీట్ చేసింది.

అనుప‌మపై ప‌వ‌న్ ఫ్యాన్స్ ఆగ్ర‌హం..సారీ చెప్పిన బ్యూటీ!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts