పవన్ అభిమానులకు శుభవార్త ..!

May 8, 2021 at 3:10 pm

జనసేన అధినేత, టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొద్ది రోజుల క్రితం క‌రోనా బారిన ప‌డిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ కొద్ది రోజులుగా త‌న ఫాం హౌజ్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. ఆయ‌న కోలుకున్న విష‌యాన్ని జ‌నసేన పార్టీ అధికారికంగా ప్ర‌క‌టించింది. మూడు రోజుల కింద‌ట పవన్ కళ్యాణ్ కు ఆర్‌టీపీసీఆర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఆ ప‌రీక్ష‌ల‌లో ఆయనకు నెగెటివ్ వ‌చ్చింది. ఆరోగ్య‌ప‌రంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ కి ఎలాంటి ఇబ్బందులు లేవ‌ని వైద్యులు తెలిపిన‌ట్టు జ‌న‌సేన ప్ర‌క‌టించింది.

పవన్ కళ్యాణ్ కు ఇటీవల ఆర్టిపిసిఆర్ టెస్ట్ చేశారు. అందులో పవన్ కి నెగిటివ్ రిపోర్ట్ వచ్చినట్లు ప్రకటనలో పార్టీ నాయకులు తెలిపారు. అయితే ఆరోగ్యరీత్యా అంతా బాగానే ఉన్న కొంత నీరసంగా పవన్ కి ఉన్నట్లు స్పష్టం చేశారు. కరోనా వచ్చినప్పుడు త్వరగా తమ నాయకుడు పవన్ కళ్యాణ్ కోలుకోవాలని వారు ప్రార్జించారు. త‌న ఆరోగ్యక్షేమాల కోసం పూజ‌లు, ప్రార్ధ‌న‌లు చేసిన జ‌నసైనికులు, నాయ‌కులు, అభిమానుల‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు.

పవన్ అభిమానులకు శుభవార్త ..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts