అన్న‌కు మ‌రో ఛాన్స్ ఇస్తున్న ప‌వ‌న్ కళ్యాణ్‌?!

May 16, 2021 at 9:03 am

లాంగ్ గ్యాప్ త‌ర్వాత వ‌కీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం మంచి విజ‌యం అందుకుంది. ప్ర‌స్తుతం క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్న ప‌వ‌న్‌.. ఆ త‌ర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం, అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్, బండ్ల గ‌ణేష్ నిర్మాణంలో ఓ చిత్రం, ఏఎం రత్నం నిర్మాణంలో ఓ చిత్రం ఇలా వ‌రుస సినిమాలు చేయ‌నున్నాడు.

అయితే అన్న నాగ‌బాబు నిర్మాణంలో కూడా త్వ‌ర‌లోనే ప‌వ‌న్ ఓ సినిమా చేయ‌నున్నాడ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. గ‌తంలో నాగ‌బాబు నిర్మాణంలో ప‌వ‌న్ హీరోగా వ‌చ్చిన గుడుంబా శంక‌ర్ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డింది.

అయితే ఆ స‌మ‌యంలో మీకు మ‌రో సినిమా చేస్తా అన్న‌య్య అంటూ అప్ప‌ట్లో నాగ‌బాబుకు ప‌వ‌న్ మాట ఇచ్చాడ‌ట‌. ఆ మాట ప్ర‌కార‌మే ఇప్పుడు అన్నకు మ‌రో సారి ఛాన్స్ ఇచ్చేందుకు ప‌వ‌న్ డిసైడ్ అయ్యాడ‌ట‌. ఈ క్ర‌మంలోనే నాగ‌బాబు ప్ర‌స్తుతం ప‌వ‌న్ కోసం మంచి క‌థ‌ను వెతికే ప‌నిలో ఉన్నాడ‌ని జోరుగా ప్ర‌చారం న‌డుస్తోంది. మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాల్సి ఉంది.

అన్న‌కు మ‌రో ఛాన్స్ ఇస్తున్న ప‌వ‌న్ కళ్యాణ్‌?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts