మాస్క్ లేద‌ని మ‌హిళ‌ను రోడ్డుపై చితకబాదిన పోలీసులు..వీడియో వైర‌ల్‌!

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకు ప‌డుతోంది. ఈ మ‌మ‌హ్మారి దెబ్బ‌కు ప్ర‌తి రోజు దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌ల్లో పాజిటివ్ కేసులు న‌మోదు అవుతుండ‌గా.. వేల మంది మృత్యువాత ప‌డుతున్నారు. ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో క‌రోనా నుంచి త‌ప్పించుకోవాలంటే.. మాస్కులు ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం, శానిటైజేషన్ వాడ‌టం తప్పనిసరి.

అయితే తాజాగా మాస్క్ లేద‌నే కార‌ణంగా ఓ మ‌హిళ‌ను పోలీసులు న‌డి రోడ్డుపై చిత‌క‌బాదారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఈ దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ మ‌హిల త‌న కూతురుతో సరుకులు కొనుక్కుని వెళ్ల‌డానికి బ‌య‌ట‌కు వెళ్లింది. ఆమె మాస్కు పెట్టుకోపోవ‌డాన్ని చూసిన పోలీసులు ఆమెను స్టేష‌న్‌కు తీసుకెళ్ల‌డానికి వాహ‌నం ఎక్కాల‌ని చెప్పారు. ఆమె ఎక్కక‌పోవ‌డంతో ఓ లేడీ పోలీసు ఆమెపై దాడికి దిగింది.

మ‌ధ్య‌తో ఆమె కూతురు అడ్డు ప‌డ‌గా.. ఆమెను ప‌క్క‌కు నెట్టేశారు పోలీసులు. త‌ప్పు అయిపోయింది, వ‌దిలి పెట్టండ‌ని స‌ద‌రు మ‌హిళ వేడుకుంటున్నా..వాహ‌నంలోకి ఎక్కాలంటూ న‌డిరోడ్డుపైనే కొట్టారు. ఆమె ఎంత‌కీ ఎక్క‌క‌పోవ‌డంతో..ఆమె జుట్టుపట్టుకుని, రోడ్డుపై ప‌డేసి కొట్టారు. ఈ దృశ్యాల‌ను అక్క‌డే ఉన్న ఒక‌రు స్మార్ట్‌ఫోన్‌లో తీసి.. సోష‌ల్ మీడియాలో పెట్ట‌గా ప్ర‌స్తుతం ఆ వీడియో వైర‌ల్‌గా మారింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు.. పోలీసుల తీరుకు మండిప‌డుతున్నారు.

https://twitter.com/Anurag_Dwary/status/1394995489557385225?s=20