టాలీవుడ్‌లో మ‌రో విషాదం..ప్ర‌ముఖ నిర్మాత సతీమణి కన్నుమూత!

May 4, 2021 at 3:18 pm

ఈ మ‌ధ్య కాలంలో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో వ‌రుస విషాదాలు చోటుచేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఒక విషాదాన్ని జీర్ణించుకోక‌ముందే.. మ‌రో విషాదం జ‌రిగిపోతుంది. తాజాగా టాలీవుడ్‌ నిర్మాత కొడాలి వెంకటేశ్వరరావు సతీమణి అనిత మంగళవారం క‌న్నుమూశారు.

ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా అనిత మృతి చెందారు. అనిత అకాల మ‌ర‌ణంపై సినీ ప్ర‌ముఖులు సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు. కాగా, కొడాలి వెంకటేశ్వరరావుతో పాటు అనిత కూడా కొన్ని చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు.

టాలీవుడ్‌లో మ‌రో విషాదం..ప్ర‌ముఖ నిర్మాత సతీమణి కన్నుమూత!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts