ఫస్ట్ అండ్ ఫాస్టెస్ట్ రికార్డ్ క్రియేట్ చేసిన `పుష్ప‌`రాజ్‌!

May 4, 2021 at 1:46 pm

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో బన్నీ కనిపించబోతున్నారు. ఇక పుష్ప‌రాజ్‌ను ప‌రిచయం చేస్తూ బ‌న్నీ బ‌ర్త్‌డే నాడు పుష్ప‌ టీజ‌ర్‌ను విడుద‌ల చేసింది చిత్రం యూనిట్‌.

అయితే తాజాగా ఈ టీజ‌ర్ ఫస్ట్ అండ్ ఫాస్టెస్ట్ రికార్డ్‌ను క్రియేట్ చేసింది. 60 మిలియన్ వ్యూస్ మరియు 1.4 మిలియన్ లైక్స్ తో పుష్ప టీజర్ మన టాలీవుడ్ లో త‌క్కువ స‌మ‌యంలోనే మరో భారీ రికార్డును సెట్ చేసింది.

ఫస్ట్ అండ్ ఫాస్టెస్ట్ రికార్డ్ క్రియేట్ చేసిన `పుష్ప‌`రాజ్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts