మృత్యువును ఆపేసే `టాబ్లెట్`తో వ‌స్తున్న వ‌ర్మ‌!

హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా వ‌రుస సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌. ఒకప్పుడు తన సినిమాలతో సంచలనాలకు మారు పేరుగా నిలిచిన వ‌ర్మ‌.. ఇప్పుడు కేవ‌లం కాంట్రవర్సీ సినిమాలు చేస్తూ వార్త‌ల్లో నిలుస్తున్నాడు.

థియేట‌ర్లు మూత‌ప‌డ‌టంతో.. ఇటీవ‌లె స్పార్క్ ఓటీటీ ప్లాట్ ఫామ్‌ను స్థాపించి డీ-కంపెనీ సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించారు. ఇక ఇప్పుడు ఈ ప్లాట్ ఫామ్ ద్వారా విడుదల కాబోతోన్న మరో సినిమా టాబ్లెట్. తాజాగా వ‌ర్మ టాబ్లెట్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు.

ఒక చేతిలో టాబ్లెట్ ఉండగా.. దాని కోసం క్రింద నుంచి అనేకమంది చేయి చేస్తున్నట్లు ఈ పోస్టర్ లో చూపించారు. ప్రతీ ఒక్కరూ వృద్ధాప్యం వస్తోందంటే కచ్చితంగా మృత్యువు గురించి భయపడతారు. టాబ్లెట్ చిత్రం మృత్యువును ఆపేసే ఒక మెడిసిన్ చుట్టూ తిరుగుతుంద‌ని వ‌ర్మ తెలిపాడు.

Image