నెటిజ‌న్ల తీరుకు రేణూ దేశాయ్‌ తీవ్ర ఆవేద‌న‌..ఏం జ‌రిగిందంటే?

May 15, 2021 at 7:44 am

త‌గ్గిన‌ట్టే త‌గ్గిన క‌రోనా వైర‌స్ మ‌ళ్లీ దేశ ప్ర‌శ‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సెకెండ్ వేవ్‌ రూపంలో విరుచుకు ప‌డుతున్న క‌రోనా వ‌ల్ల ప్ర‌తి రోజు వేల మంది మృత్యువాత ప‌డుతున్నారు. ముఖ్యంగా హాస్ప‌ట‌ల్స్ లో బెడ్స్ కొర‌త‌, ఆక్సిజ‌న్ కొర‌త ఎక్కువ‌గా ఉండ‌టం వ‌ల్లే మ‌ర‌ణాలు ఎక్కువ‌గా సంభ‌విస్తున్నారు.

ఇలాంటి త‌రుణంలో క‌రోనా బాధితుల‌ను ఆదుకునేందుకు ప‌లువురు ప్ర‌ముఖులు ముందుకు వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఒక‌ప్ప‌టి హీరోయిన్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య‌ రేణు దేశాయ్ కూడా ఇటీవ‌ల తన ఇన్‌స్టాగ్రామ్‌ మెసేజ్‌ ఇన్‌ బాక్స్ ఓపెన్‌లో పెడతాన‌ని.. ప్లాస్మా లేదా ఆక్సిజన్‌ సిలిండర్లు లేదా హాస్పిటల్స్‌లో బెడ్స్‌ లేదా మందులు.. వంటివి అవసరం ఉంటే త‌న‌కు మెసేజ్ చేయండి..త‌న వంతు సాయం చేస్తాన‌ని ప్ర‌క‌టించింది.

దీంతో ప‌లువురు నెటిజ‌న్లు అవ‌స‌రం లేకున్నా ఆమెకు మెసేజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నెటిజ‌న్ల తీరుకు రేణూ తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేసింది. అత్యవసరమైతేనే తనకు మెసేజ్‌ చేయాలని.. అలాంటి సందర్భంలో తన స్వచ్ఛంద సంస్థ తరపున సాయం చేస్తా. అంతేకాని అనవసరమైన మెసేజులతో తన ఇన్‌బాక్స్‌ నింపవ‌ద్దు.. అలా చేస్తే అవసరమైన వారి మెసేజులు చూడలేకపోతున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

నెటిజ‌న్ల తీరుకు రేణూ దేశాయ్‌ తీవ్ర ఆవేద‌న‌..ఏం జ‌రిగిందంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts